Authorization
Fri May 16, 2025 08:44:04 pm
రాజమండ్రి: ఏపీ సీఎం జగన్ పర్యటనలో అపశృతి చోటు చేసుకుంది. రాజమండ్రి క్వారీ మార్కెట్లో మహిళ కాలిపై ఆర్టీసీ బస్సు దూసుకెళ్లడంతో ఆమె తీవ్రంగా గాయపడింది. జగన్ సభ వద్దకు వాలంటీర్ బలవంతంగా ఆమెను తీసుకు వస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. అనూహ్యంగా ఆమె కాలు పైకి ఆర్టీసీ బస్సు ఎక్కింది. దీంతో సదరు మహిళ కాలు నుజ్జునుజ్జు అయిపోయింది. వెంటనే స్థానికులు ఆమెను చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.