Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - న్యూఢిల్లీ
భారత్లో రియల్మి 10 4జీ లాంఛ్ డేట్ను రియల్మి వెల్లడించింది. న్యూ స్మార్ట్ఫోన్ జనవరి 9న దేశీ మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వనుందని కంపెనీ తన అదికారిక వెబ్సైట్లో ప్రకటించింది. రియల్మి 10 4జీ మీడియాటెక్ హెలియో జీ99 చిప్సెట్తో 90హెచ్జడ్ అమోల్డ్ డిస్ప్లేతో కస్టమర్ల ముందుకు రానుంది. రిటైల్ అవుట్లెట్లతో పాటు ఈ స్మార్ట్ఫోన్ ఫ్లిప్కార్ట్లోనూ అందుబాటులో ఉంటుంది. 50 ఎంపీ ప్రైమరీ కెమెరా సెన్సర్ సహా రియల్మి 10 డ్యూయల్ రియర్ కెమెరా సిస్టంతో ఈ స్మార్ట్ఫోన్ ఆకట్టుకోనుంది. ఇక అధికారిక పోస్టర్లో రియల్మి 10 హోల్ పంచ్ డిస్ప్లేతో రానున్నట్టు వెల్లడైంది. బయోమెట్రిక్ సెక్యూరిటీ కోసం పవర్ బటన్లో ఫింగర్ ప్రింట్ స్కానర్ ఇంటిగ్రేట్ చేసినట్టు కనిపించింది. 6.4 ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లేతో ఎడమవైపున సెల్ఫీ కెమెరా అమర్చారు. ఇక రియల్మి లేటెస్ట్ స్మార్ట్ఫోన్ ధర రూ.15,000 వరకూ ఉండనుంది.