Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
హాష్ ఆయిల్ తయారు చేస్తున్న ముఠాను నార్కోటిక్ ఎన్ఫోర్స్ మెంట్ వింగ్ అరెస్ట్ చేసింది. సంక్రాంతి పండుగ టార్గెట్‌గా హాష్ ఆయిల్ తయారు చేస్తున్నారు. ఈ కేసులో ప్రవీణ్ కుమార్ అనే సప్లైర్ అరెస్ట్ అయ్యాడు. మోహన్ యాదవ్, కల్యాణ్, సురేష్ అనే ముగ్గురు డ్రగ్ కంజూమర్స్ సైతం అరెస్ట్ అయ్యారు. 60 బాటిల్స్ హాష్ ఆయిల్, నాలువందల లీటర్స్ పెట్రోల్ ఈథర్ స్వాధీనం చేసుకున్నారు. పెట్రోలియం ఈథర్, గంజాయితో హాష్ ఆయిల్ తయారు చేస్తున్నారు. 15 మంది పెడ్లర్స్‌తో ప్రవీణ్‌కు సంబంధాలు ఉన్నాయని నార్కోటిక్ అధికారులు గుర్తించారు.