Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : భారత్ డిజిటల్ ఇండియాలో దూసుకుపోతుంది. గ్రామాలనుంచి పట్టణాలవరకు జనాలు డిజిటల్ చెల్లింపులకి అలవాటుపడటం వల్ల డిసెంబర్ నెలలో రికార్డ్ స్థాయిలో ఆన్ లైన్ పేమెంట్స్ జరిగాయి. డిపార్ట్ మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇండియా చెప్పిన లెక్కల ప్రకారం ఒక్క డిసెంబర్ నెలలోనే .12.82 కోట్ల యూపీఐ పేమెంట్స్ చేశారట. ఇదే ఇప్పటివరకు ఆల్ టైం రికార్డ్. గతేడాది అక్టోబర్ లో యూపీఐ చెల్లింపులు తొలిసారిగా రూ.12లక్షల కోట్ల మార్కును దాటాయి. నవంబర్ నెలలో రూ.11.90లక్షల కోట్ల చెల్లింపులు జరిగాయి. ఎలాంటి అదనపు చార్జీలు లేకుండా పేమెంట్ చేసుకునే సదుపాయం కలిపిస్తున్నందుకు ఎక్కువ మంది యూపీఐ పేమెంట్స్ కి మొగ్గు చూపుతున్నారు. ఆన్ లైన్ పేమెంట్ ప్లాట్ ఫామ్స్ లో మొదటి స్థానంలో ఫోన్ పే ఉండగా, రెండవ స్థానంలో గూగుల్ పే ఉంది. తర్వాతి స్థానాల్లో అమెజాన్ పేమెంట్స్ బ్యాంక్, పేటిఎం ఉన్నాయి.