Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : 'ఆహా' ఫ్లాట్ ఫామ్ పై 'అన్ స్టాపబుల్ 2' టాక్ షో జోరుగా జరుగుతోంది. సురేశ్ బాబు .. అల్లు అరవింద్ .. రాఘవేంద్రరావు .. కోదండ రామిరెడ్డి పాల్గొన్న ఎపిసోడ్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఆ తరువాత జయసుధ .. జయప్రద .. రాశి ఖన్నాతో చేసిన ఎపిసోడ్ కూడా ఎంతగానో ఆకట్టుకుంది. ఇక క్రితం వారం వచ్చిన ప్రభాస్ ఎపిసోడ్ ఎక్కువమందికి రీచ్ అయింది. ఈ ఎపిసోడ్ ను అందరూ ఎంజాయ్ చేశారు. ప్రభాస్ కి సంబంధించిన సెకండ్ ఎపిసోడ్ ఈ నెల 6వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ ఎపిసోడ్ లో ప్రభాస్ ను బాలయ్య ఏయే ప్రశ్నలు అడగనున్నాడా అనే ఆసక్తితో అభిమానులు ఉన్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 13వ తేదీన 'వీరసింహారెడ్డి' టీమ్ సభ్యులు ఈ టాక్ షోలో పాల్గొననున్నారు. జనవరి 12వ తేదీనే ఈ సినిమా రిలీజ్ అవుతుందనే సంగతి తెలిసిందే. ఆ తరువాతనే పవన్ కల్యాణ్ ఎపిసోడ్ స్ట్రీమింగ్ కానుంది. ఈ వివరాలకు సంబంధించిన పోస్టర్ ను కొంతసేపటి క్రితమే వదిలారు.