Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: నుమాయిష్ సందర్భంగా హైదరాబాద్ మెట్రోసేవల్లో మార్పులు చేసినట్లు మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ఎల్బీనగర్-మియాపూర్, నాగోల్-రాయదుర్గ్ మార్గాల్లో రాత్రి ఒంటిగంట వరకు మెట్రోసేవలు అందుబాటులో ఉంటాయన్నారు. టెర్మినల్ స్టేషన్ల నుంచి చివరి రైళ్లు అర్ధరాత్రి 12 గంటలకు ప్రారంభమవుతాయని చెప్పారు. ఈ మార్పులు ఫిబ్రవరి 15 అర్ధరాత్రి వరకు అమల్లో ఉంటాయని అన్నారు. నుమాయిష్ రద్దీ దృష్ట్యా గాంధీభవన్ మెట్రో స్టేషన్లో టికెట్ బుకింగ్ కౌంటర్ల సంఖ్యను పెంచినట్లు ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. సాధారణంగా ఉన్న నాలుగు కౌంటర్లతోపాటు మరో రెండు కౌంటర్లను అదనంగా ఏర్పాటు చేశామన్నారు. నుమాయిష్ మస్నూవత్ ఇ ముల్కీ.. అంటే స్థానిక ఉత్పత్తుల ప్రదర్శనశాల. నుమాయిష్ ఎగ్జిబిషన్.. ప్రపంచంలోనే అతిపెద్ద మేళా. ఏటా జనవరి 1 నుంచి 45 రోజులపాటు హైదరాబాద్లో జరుగుతుంది. జమ్ముకశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దేశంలోని ప్రముఖ కంపెనీలు, స్థానిక సంస్థల ఉత్పత్తులు, హ్యాండీక్రాఫ్ట్స్, చేనేత వస్త్రాలు, ఎలక్ట్రికల్ పరికరాలు ఇలా అన్నీ ఇక్కడ కొలువుదీరిన స్టాళ్లలో లభిస్తాయి.