Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : సీపీఐ(ఎం) నేత సాజి చెరియన్ను తిరిగి క్యాబినెట్లోకి తీసుకునేందుకు అనుమతించాలంటూ కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ చేసిన ప్రతిపాదనకు ఆ రాష్ట్ర గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ ఆమోదముద్ర వేశారు. దాంతో చెరియన్ రేపు సాయంత్రం 4 గంటలకు కేరళ మంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. సాజి చెరియన్ గత ఏడాది జూలైలో పథనంథిట్ట జిల్లాలో రాజ్యాంగానికి వ్యతిరేకంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దాంతో అతనిపై క్రిమినల్ కేసు నమోదైంది. ఆ కారణంగా ఆయన మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు ఆయనను తిరిగి క్యాబినెట్లోకి తీసుకోవాలని విజయన్ భావించారు. ఆ మేరకు గత నెల 30న గవర్నర్కు అభ్యర్థన పంపారు.
అయితే, సీఎం ప్రతిపాదనపై గవర్నర్ సోమవారం అభ్యంతరం వ్యక్తంచేశారు. అయినా సీఎం మళ్లీ అదే ప్రతిపాదన చేయడంతో ఇవాళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఆమోదం తెలిపారు.