Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : భారత్ లో కరోనా సూపర్ వేరియంట్ ఎక్స్ బీబీ 1.5 కలకలం కొనసాగుతోంది. ఇప్పటికే ఒమిక్రాన్ సబ్ వేరియంట్ బీఎఫ్-7 ఉనికి వెల్లడైన నేపథ్యంలో ఇప్పుడీ సూపర్ వేరియంట్ ఆందోళన కలిగిస్తోంది. ఇది ఇతర కరోనా వేరియంట్లతో పోల్చితే 120 రెట్లు అధిక వేగంతో వ్యాపిస్తుంది. ఈ నేపథ్యంలో, గత రెండు వారాలుగా దేశంలో కరోనా కేసులపై ప్రభుత్వం దృష్టి సారిస్తోంది. ఊరట కలిగించే అంశం ఏమిటంటే, చైనా, అమెరికా తదితర దేశాలతో పోల్చితే భారత్ లో కరోనా వ్యాప్తి చాలా తక్కువ స్థాయిలో ఉంది. గడచిన వారంలో దేశంలో కరోనా కేసుల సంఖ్యలో స్వల్ప పెరుగుదల నమోదైంది. అంతకుముందు వారం 1,219 కేసులు నమోదు కాగా, గత వారం 1,526 కొత్త కేసులు వెల్లడయ్యాయి. రాష్ట్రాల్లో కరోనా కేసులు చూస్తే అత్యధికంగా కర్ణాటకలో 276 కేసులు నమోదయ్యాయి.