Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: మెట్రో రైల్ కార్యకలాపాలకు ఆటంకం కలిగిస్తూ ఉద్యోగులు సమ్మె చేపట్టడంపై హైదరాబాద్ మెట్రో రైలు మేనేజ్మెంట్ స్పందించింది. కాంట్రాక్టింగ్ ఏజెన్సీ కింద పనిచేస్తున్న కొంతమంది టిక్కెటింగ్ సిబ్బంది సహేతుకం కానప్పటికీ విధులకు దూరంగా ఉండి ప్రయాణీకులకు అసౌకర్యాన్ని కలిగించారని హెచ్చరించింది. మెట్రో రైల్ కార్యకలాపాలకు అవాంతరాలను కలిగించే ఉద్దేశ్యంతోనే సమ్మెకు దిగినట్టు పేర్కొంది. తమ స్వార్థ ప్రయోజనం కోసం తప్పుడు సమాచారం, పుకార్లను సైతం వ్యాప్తిచేస్తున్నారని వెల్లడించింది. సమ్మెపై వాదనలు తప్పని తెలిపింది. ఉద్యోగుల చర్యలు ప్రజా ప్రయోజనాలకు పూర్తి విరుద్ధమైనవని, వారిపై కఠిన చర్యలను తీసుకోవాల్సిందిగా హెచ్ఎంఆర్ మేనేజ్మెంట్ కోరుతోందని వెల్లడించింది. సిబ్బందికి తగిన వసతులు, ప్రయోజనాలను మేనేజ్మెంట్ అందిస్తుందని, అయితే, వారు మరింతగా ఏమి కోరుకుంటున్నారో తెలుసుకునేందుకు తగిన చర్చలు జరుపనున్నట్టు మేనేజ్మెంట్ వెల్లడించింది. రైలు కార్యకలాపాలు నిర్ధేశిత సమయానికే నడుస్తున్నాయని, తగిన సిబ్బంది కూడా పూర్తిగా అందుబాటులో ఉన్నారని ఒక ప్రకటన విడుదల చేసింది.