Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఆంధ్రప్రదేశ్
నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్ నేడు ఏపీ హైకోర్టులో విచారణకు వచ్చింది. తనపై ఉన్న కేసుల వివరాలు ఇచ్చేలా పోలీసులను ఆదేశించాలని రఘురామకృష్ణరాజు తన పిటిషన్ లో కోరారు. ఈ తరుణంలో రఘురామ తరఫున హైకోర్టులో న్యాయవాది ఉమేశ్ చంద్ర వాదనలు వినిపించారు.
రాష్ట్రంలో ఇప్పటికే పెండింగ్ లో ఉన్న కేసులతోపాటు, కొత్తగా నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ల వివరాలు ఇవ్వాలని డీజీపీకి లేఖ రాశామని రఘురామ తెలిపారు. కానీ డీజీపీ నుంచి స్పందన రాలేదన్నారు. సంక్రాంతి సమయంలో తన పార్లమెంటు నియోజకవర్గానికి వెళ్లాలనుకుంటున్నట్టు కోర్టుకు వివరించారు. నియోజకవర్గానికి వస్తే పోలీసులు అప్పటికప్పుడు ఎఫ్ఐఆర్ ను సృష్టించి అరెస్ట్ చేసే అవకాశం ఉందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. తక్షణమే ఈ అంశంపై విచారణ చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.