Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ (గేట్ 2023) అడ్మిట్ కార్డ్ విడుదల తేదీని పొడగించారు. అడ్మిట్ కార్డులను ఈనెల 9న జారీ చేయనున్నారు. అంతకుముందు అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకునేందుకు గడువును జనవరి 3 గా ప్రకటించారు. అడ్మిట్ కార్డ్‌ను డౌన్లోడ్ చేయడంలో జాప్యం జరుగుతున్నట్లుగా అధికారులు గుర్తించి, ఈ మేరకు విడుదల తేదీని పొడగించారు. గేట్ 2023 కోసం విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం, పరీక్ష కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) మోడ్‌లో ఉంటుంది. పరీక్ష వ్యవధి 3 గంటలు. మొత్తం 29 సబ్జెక్టులు/పేపర్లు ఉంటాయి. ప్రశ్నపత్రంలో జనరల్ ఆప్టిట్యూడ్, అభ్యర్థులు ఎంచుకున్న సబ్జెక్టుల నుంచి 65 ప్రశ్నలు అడుగుతారు. ఈ ప్రశ్నలు మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు, మల్లిపుల్ సెలక్టెడ్ ప్రశ్నలు, న్యూమరికల్ ఆన్సర్ టైప్ ఉంటాయి. జనరల్ ఆప్టిట్యూడ్‌కు గరిష్ట మార్కులు 15, సబ్జెక్టుకు 85 మార్కులు. ఈ ఏడాది గేట్ పరీక్షను ఐఐటీ కాన్పూర్ నిర్వహిస్తున్నది. గత ఏడాది మాక్ టెస్ట్‌ల లింక్‌ల కోసం అధికారిక వెబ్సైట్ www.gate.iitk.ac.inలో సంప్రదించాలి.