Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
ప్రజల భద్రత కోసమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రోడ్లపై సభలు, ర్యాలీలు నిషేదం విధించింది. రోడ్లపై కాకుండా గ్రౌండ్లో సభలు జరుపుకోవచ్చుని, కేవలం ప్రతిపక్షాలపై పరిమితులు విధించలేదు. ఇది అన్ని రాజకీయ పార్టీలకు వర్తిస్తుందని, వైఎస్సార్సీపీ కూడా నిబంధనలు పాటించాల్సి ఉంటుందని తెలిపింది.
ఇకపై జాతీయ, రాష్ట్ర, మున్సిపల్, పంచాయతీరాజ్ రహదారులపైన, మార్జిన్లలో సభలు, ర్యాలీలకు అనుమతించేది లేదని స్పష్టంచేసింది. అత్యంత అరుదైన సందర్భాల్లో జిల్లా ఎస్పీలు లేదా పోలీస్ కమిషనర్లు కచ్చితమైన షరతులతో అనుమతి ఇవ్వొచ్చని మినహాయింపునిచ్చింది. రాబోయే రోజుల్లో నిబంధనలకు లోబడే సభలు జరుపుకోవాలని, షరతులు ఉల్లంఘిస్తేనే నిర్వాహకులపై కఠిన చర్యలు తప్పవని తెలియజేశారు.