Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కరీంనగర్
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ ఇందిరానగర్లో దారుణం జరిగింది. ప్రేమించి పెళ్లి చేసుకున్నారనే కారణంతో ప్రియుడి ఇంటిని ప్రియురాలి తరపు బంధువులు దగ్ధం చేశారు. అయితే తరుణంలో తమ ఇష్టప్రకారమే పెళ్లి చేసుకున్నామని తమకు రక్షణ కల్పించాలని ఆ ప్రేమ జంట పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటనలో రూ.3 నుంచి రూ.5 లక్షల వరకు నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో పోలీసులు ఇరు వర్గాలను స్టేషన్కు పిలిపించి కౌన్సిలింగ్ ఇస్తున్నారు.