Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరుగుతున్న తొలి టీ20లో ఓపెనర్ శుభ్‌మన్ గిల్ తొందరగానే వెనుదిరిగాడు. 7 పరుగుల వద్ద తీక్షణ బౌలింగ్‌లో ఎల్బీగా అవుట్ అయ్యాడు. సూర్యకుమార్ యాదవ్ క్రీజులోకి వచ్చాడు. బంగ్లాదేశ్ సిరీస్‌లో డబుల్ సెంచరీ చేసిన ఇషాన్ రెచ్చిపోయి ఆడుతున్నాడు. 10 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్సర్‌తో 18 పరుగులు చేశాడు. ప్రస్తుతం భారత్ ఒక వికెట్ నష్టానికి 28 రన్స్ చేసింది. టాస్ గెలిచిన శ్రీలంక కెప్టెన్ శనక ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్ ఓపెనర్లు వచ్చారు. భారత పర్యటనలో శ్రీలంక మూడు టీ20ల సిరీస్ ఆడనుంది. రెండో టీ20 జనవరి 5న, మూడో టీ20 జనవరి 7వ తేదీన జరగనున్నాయి. హార్ధిక్ పాండ్యా నేతృత్వంలోని యువకులతో కూడిన జట్టుని బీసీసీఐ ప్రకటించింది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ వంటి సీనియర్లు లేకుండానే బరిలోకి దిగింది. వీళ్లంతా వన్డే సిరీస్‌లో జట్టుతో కలవనున్నారు. గాయం నుంచి కోలుకుని ఫిట్‌గా ఉన్న సీనియర్ పేసర్ బుమ్రా కూడా వన్డే మ్యాచ్‌లకు ఎంపికయ్యాడు.