Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : కొత్త ఏడాది ప్రారంభంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ పాటల రచయిత పెద్దాడ మూర్తి అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మంగళవారం తుదిశ్వాస విడిచారు. ఆయన మృతిపై పలువురు సినీ ప్రముఖులు తమ సంతాపం తెలిపారు. అంత్యక్రియలు బుధవారం జరగనున్నట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. కాగా.. విశాఖపట్నంలోని భీముని పట్నంలో పెద్దాడ మూర్తి స్వస్థలం. జర్నలిస్ట్ గా ఆయన కెరీర్ ప్రారంభించారు. పలు పత్రికల్లో పని చేసిన మూర్తి ప్రముఖ నిర్మాత, దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ సహకారంతో ఇండస్ట్రీలో ప్రవేశించారు. 'కూతురు' సినిమాకు మొదటి పాటను రాశారు. ఆ తర్వాత ఇడియట్, మధుమాసం, అమ్మానాన్న ఓ తమిళ అమ్మాయి, పౌరుడు, కౌసల్య సుప్రజ రామ, స్టాలిన్ చిత్రాలకు పాటలు రాశారు. పలు సీరియళ్లకు కూడా మూర్తి పాటలు రాశారు. కృష్ణ వంశీ దర్శకత్వం వహించిన 'చందమామ' సినిమాలో 'బుగ్గే బంగారమా', మెగాస్టార్ చిరంజీవి నటించిన స్టాలిన్ సినిమాలో 'సిగ్గుతో ఛీ ఛీ' పాటకు పలువురు ప్రముఖుల నుంచి ప్రశంసలు పొందారు.