ఇండల్ వాయి మండలంలోని నల్లవెల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుల తల్లి సావిత్రి బాయి పూలే జయంతి ఉత్సవాలలో నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల ఐడిసిఎంఎస్ చైర్మన్ & టిఎస్ మార్క్ ఫెడ్ డైరెక్టర్ సంబారి మోహన్ తోపాటు మండల వైస్ ఎంపీపి భూసాని అంజయ్య, సర్పంచ్ నోముల విజయలక్ష్మా రెడ్డి లకు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఐడిసిఎంఎస్ చైర్మన్ సంబారి మోహన్ మాట్లాడుతూ ముందుగా ఈ సావిత్రి బాయి పూలే జయంతి వేడుకలు నల్లవెల్లి గ్రామంలో జరుపుకోవాడం చాలా ఆనందంగా ఉందన్నారు. ప్రతీ ఒక్క మహిళ ఒక శక్తి స్వరూపిణి ఒక ఆది శక్తి సావిత్రి బాయి పూలే అన్నారు. విద్యను అభ్యసించి తోటి మహిళలందరికీ తను నేర్చుకున్న విద్య బోధన చేశారని,దేశంలో మహిళలందరికీ ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. ప్రస్తుతం అన్ని రంగాల్లో మహిళలు నిలుస్తున్నారని అదే స్పూర్తిని కొనసాగించాలన్నారు.అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు సాంబార్ మోహన్ ను శాలువా జ్ఞాపికతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో బిఅర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఏడ్ల శ్రీనివాస్ , విడిసి సభ్యులు,మండల విద్యాశాఖ అధికారి శ్రీనివాస్ రెడ్డి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు సాయిలు, బి.సి & ఎస్టి ఉపాధ్యాయ సంఘ అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు, వివిధ గ్రామాల పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థులు పాల్గొన్నారు.