Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : తొలి టీ20 టీమిండియా తడబడింది. శ్రీలంక బౌలర్లు చెలరేగడంతో భారత్ వరుసగా వికెట్లు కోల్పోయింది. అయితే.. ఆల్రౌండర్లు దీపక్ హుడా 41, అక్షర్ పటేల్31 ఆఖర్లో దూకుడుగా ఆడడంతో 20 ఓవర్లకు 162 పరుగులు చేసింది. వీళ్లిద్దరూ ఐదో ఆరో వికెట్కు విలువైన భాగస్వామ్యం నిర్మించారు. ఓపెనర్ ఇషాన్ తొలి ఓవర్ నుంచే లంక బౌలర్ల మీద విరుచుకపడ్డాడు. అయితే.. శుభ్మన్ గిల్ (7) సూర్యకుమార్ యాదవ్ (7)లు వెంట వెంటనే అవుట్ కావడంతో భారత్ ఒత్తిడిలో పడింది. సంజూ శాంసన్ (5) మళ్లీ నిరాశ పరిచాడు. ఆ తర్వాత వచ్చిన కెప్టెన్ హార్దిక్ పాండ్యా వరుసగా బౌండరీలు బాది శ్రీలంక బౌలర్ల మీద ఒత్తిడి పెంచేదుకు ప్రయత్నించాడు. దూకుడుగా ఆడే క్రమంలో ఇషాన్ 37 రన్స్ వద్ద అవుట్ అయ్యాడు. ఆ వెంటనే పాండ్యా 39 పరుగులు చేసి వెనుదిరిగాడు. శ్రీలంక బౌలర్లలో మధుషనక, తీక్షణ, కరుణరత్నే, డిసిల్వా, హసరంగ తలో వికెట్ తీశారు.