Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - సూర్యాపేట
యాదవుల ఆరాధ్య దైవమైన లింగమంతులస్వామి జాతర ఫిబ్రవరి ఐదో తేదీ నుంచి ఐదు రోజులపాటు సాగనున్నది. ఈ తరుణంలో తెలంగాణలో రెండో అతిపెద్దదైన సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలంలోని దురాజ్‌పల్లి (పెద్దగట్టు) లింగమంతులస్వామి జాతర నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.5 కోట్లు విడుదల చేసింది. ఈ మేరకు మంగళవారం జీవో జారీచేసింది.
2017లో జాతరకు రూ.1.29 కోట్లు, 2019లో రూ.1.75 కోట్లు, 2021లో రూ.2 కోట్లు ఖర్చు చేశారు. వచ్చే నెలలో జాతర నిర్వహణ కు ప్రభుత్వం మరో రూ.5 కోట్లు మంజూరు చేసింది. ఆ నిధులతో ప్రణాళికాబద్ధంగా సకల సౌకర్యాలు కల్పిస్తామని లింగమంతుల స్వామి ఆలయ పాలకవర్గ చైర్మన్ కోడి సైదులుయాదవ్ తెలిపారు.