Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
త్రిపుర మాజీ సీఎం, బీజేపీ ఎంపీ బిప్లబ్ దేవ్ ఇంటిపై దుండగులు దాడికి పాల్పడ్డారు. ఉదయ్‌పూర్‌లోని బిప్లబ్ దేవ్ ఇంట్లో ఆయన తండ్రి సంవత్సరికంలో భాగంగా ఏటా యజ్ఞయాగాదులు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా మంగళవారం రాత్రి ఉదయ్‌పూర్‌లోని ఆయన పూర్వీకుల ఇంటికి పూజారుల బృందం చేరుకున్నది. ఈ తరుణంలో రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు వేద పండితులపై దాడికి దిగారు. వారిని విచక్షణా రహితంగా కొట్టడమే కాకుండా వారి వాహనాలకు నిప్పుపెట్టారు. సీఎం ఇంటిపై దాడిచేసి మంటలు అంటించారు. దీంతో ఇళ్లుతోపాటు మరో దుకాణం అగ్నికి ఆహుతయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అక్కడి చేరుకొని మంటలను అదుపుచేశారు.