Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
హైదరాబాద్లోని పలుచోట్ల ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. 20 బృందాలుగా విడిపోయిన ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. నగరంలోని ఎక్సెల్ గ్రూప్ కంపెనీకి సంబంధించిన ఆఫీసులు, కంపెనీ యజమాని ఇండ్లపై తెల్లవారుజామున 4 గంటలకే ఏకకాలంలో దాడులు నిర్వహించారు. సుమారు 60 మంది సిబ్బంది ఈ సోదాల్లో పాల్గొన్నారు.