Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - చెన్నై
బీజేపీకి తమిళనటి గాయత్రి రఘురామ్ రాజీనామా చేశారు. తమిళనాడు బీజేపీలో మహిళలకు భద్రత లేదని, నిజమైన కార్యకర్తలను తమిళనాడు పార్టీ విభాగంలో పట్టించుకొనేవారే లేరని ఆమె మండిపడ్డారు. తమిళనాడు సీఎం స్టాలిన్ హాజరైన ఓ వేడుకకు హాజరైందన్న కారణంగా గత నవంబర్లో ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు.
తన రాజీనామాకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కే అన్నామలై కారణమని గాయత్రి తెలిపారు. విచారణకు అవకాశం ఇవ్వలేదు మహిళలకు సమాన హక్కులు లేవు, మహిళలంటే పార్టీలో ఎవరికీ గౌరవం లేదు అని ఆమె ప్రధాని నరేంద్ర మోడీకి ట్విట్టర్లో మెసేజ్ పెట్టారు. పార్టీలో ఉండి ఇబ్బందులు పడేకన్నా, బయట ఉండి ట్రోల్స్ ఎదుర్కోవడమే మేలని భావిస్తున్నట్టు తెలిపారు.