Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-న్యూఢీల్లి
ఆర్థిక రంగం కుదేలవడంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న పాకిస్థాన్ ప్రభుత్వం వీలు కుదిరిన చోటల్లా పొదుపు మంత్రం పాటిస్తోంది. విదేశాల్లో నిరుపయోగంగా ఉంటున్న ఆస్తులను గుర్తించి అమ్మకానికి పెడుతోంది. దేశంలోనూ పొదుపు చర్యలు పాటించడంలో కఠినంగా వ్యవహరిస్తోంది. తాజాగా విద్యుత్ ఖర్చును తగ్గించుకోవడానికి వినూత్న నిర్ణయం తీసుకుంది. షాపింగ్ మాల్స్, మ్యారేజీ హాళ్లు రాత్రిపూట తెరిచి ఉంచడంపై ఆంక్షలు విధించింది. రాత్రి 8:30 గంటలకల్లా షాపింగ్ మాల్స్, రాత్రి పది దాటేలోగా మ్యారేజీ హాళ్లు మూసేయాలని ఆదేశాలు జారీ చేసింది.
నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ ప్లాన్ లో భాగంగా మంగళవారం పాకిస్థాన్ కేబినెట్ ఈ నిర్ణయం తీసుకుంది. విదేశాల నుంచి దిగుమతి చేసుకునే ఆయిల్ పైనా ఆంక్షలు విధించాలని నిర్ణయించింది. మార్కెట్లు, మ్యారేజీ హాళ్లు, షాపింగ్ మాల్స్ ను రాత్రిపూట తొందరగా మూసేయడం వల్ల దాదాపు 6 వేల కోట్లు పొదుపు చేయొచ్చని పాకిస్థాన్ రక్షణ శాఖ మంత్రి క్వాజా ఆసిఫ్ తెలిపారు.