Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ న్యూఢిల్లీ: ఎయిర్ ఇండియా విమానంలోని బిజినెస్ క్లాస్‌లో ప్రయాణిస్తున్న ఓ మహిళపై ఓ వ్యక్తి మూత్రం పోశాడు. ఈ ఘటన గత ఏడాది నవంబర్ 22న చోటుచేసుకుంది. ఎయిర్ ఇండియా విమానం అమెరికా నుంచి ఢిల్లీకి వస్తున్న సందర్భంలో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసు ఫిర్యాదు ఇచ్చినట్టు ఎయిర్ ఇండియా తెలిపింది. అయితే బాధితురాలి చెప్పిన వివరాల ప్రకారం ఆ వ్యక్తిపై చర్యను తీసుకోవాలని విమానంలోని క్యాబిన్ సిబ్బందికి చెప్పినా వారు పట్టించుకోలేదు. దీంతో ఆమె టాటా సంస్థ చైర్మన్ చంద్రశేఖరన్‌కు లేఖ రాశారు. ఆ తర్వాతే ఈ ఘటనపై విచారణ మొదలుపెట్టారు.
భోజనం తర్వాత లైట్లను డిమ్ చేసిన సమయంలో ఈ ఘటన జరిగిందని ఆమె తెలిపారు. ప్యాసింజెర్ మూత్రం పోయడం వల్ల తన దుస్తులు, బ్యాగ్, షూ తడిసినట్టు ఆరోపించారు. విమానం సిబ్బంది తనకు దుస్తుల్ని, చప్పులను ఇచ్చారని తెలిపారు. ఫస్ట్ క్లాస్‌లో చాలా సీట్లు ఖాళీగా ఉన్నా.. సిబ్బంది సీటులో ప్రయాణించాల్సి వచ్చిందని ఆమె చెప్పారు.