Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ న్యూఢిల్లీ : ఢిల్లీలో బుధవారం ఉదయం ఉష్ణోగ్రత 4.4 డిగ్రీలకు పడిపోయింది. సాధారణ ఉష్ణోగ్రత కన్నా మూడు డిగ్రీలు కనిష్టమని, ఈ సీజన్లో ఇదే అత్యంత కనిష్ట ఉష్ణోగ్రతగా భారత వాతావరణ శాఖ తెలిపింది. దట్టమైన పొగమంచు కప్పేయడంతో ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలోని పాలం అబ్జర్వేటరీ ఉదయం 5.30 గంటలకు విజిబులిటీ (దృశ్యమానత) 200 మీటర్లగా నమోదైందని అధికారులు తెలిపారు. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లు వెల్లడించారు. సుమారు 19 రైళ్లు గంటన్నర నుండి నాలుగు గంటలు ఆలస్యంగా నడిచాయని రైల్వే ప్రతినిధి తెలిపారు.
లోథిరోడ్, పాలం, జాఫర్పూర్ మరియు మయూర్ విహార్తో సహా ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రత సాధారణం కన్నా ఐదు డిగ్రీలు తక్కువగా నమోదవుతోందని పేర్కొంది. వరుసగా రెండు రోజుల పాటు కనిష్ట, గరిష్ట ఉష్ణోగ్రతలు పది డిగ్రీల కన్నా తక్కువగా నమోదవడంతో కోల్డ్డేస్గా పరిగణిస్తారని ఐఎండి తెలిపింది. రాబోయే నాలుగైదు రోజుల పాటు వాయువ్య భారతదేశంలో దట్టమైన పొగమంచు, చలి గాలులు ఉండవచ్చని ఐఎండి అంచనావేసింది.