Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ హైదరాబాద్: గతవారంలో రోడ్డు ప్రమాదంలో తీవ్రగాయాలై చికిత్స పొందుతున్న టీమ్ఇండియా యువ బ్యాటర్ రిషభ్ పంత్ డెహ్రాడూన్ ఆసుపత్రిలో కోలుకుంటున్నాడు. నుదుటికి సంబంధించి స్వల్ప ప్లాస్టిక్ సర్జరీ జరిగిన విషయం తెలిసిందే. ఇంకా మెరుగైన వైద్యం కోసం అతడిని ముంబయికి తరలించే అవకాశం ఉందని తెలుస్తోంది. రిషభ్ పంత్ ఆరోగ్య పరిస్థితిపై ఢిల్లీ క్రికెట్ బోర్డు డైరెక్టర్ శ్యామ్ శర్మ తాజాగా వివరాలను వెల్లడించారు. ‘‘మెరుగైన వైద్యం కోసం క్రికెటర్ పంత్‌ను ఇవాళ ముంబయికి తరలించే అవకాళం ఉంది’’ అని తెలిపారు. పంత్‌ను ఇప్పటికే ఐసీయూ నుంచి ప్రయివేట్ వార్డుకు మార్చిన విషయం తెలిసిందే. ముంబయి తరలించి అక్కడ బీసీసీఐ వైద్య బృందం సమక్షంలో కుడికాలు లిగ్మెంట్కు శస్త్రచికత్స నిర్వహిస్తారు. మరోవైపు బీసీసీఐ కార్యదర్శి జైషా కూడా పంత్ ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. అవసరమైతే విదేశాలకు తరలించే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్టు సమాచారం.