Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: ఢిల్లీ నుంచి పారిస్ బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానాన్ని కొద్దిసేపటికే ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. విమానంలో 218 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ సందర్భంగా అధికారులు ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రి, అగ్నిమాపకశాఖతో పాటు భద్రతా ఏజెన్సీలను అప్రమత్తం చేశారు. ఎమర్జెన్సీ ల్యాండింగ్ కోసం విమానాశ్రయంలో కొంతభాగాన్ని మూసివేశారు. ఐజీఐ ఎయిర్పోర్ట్ జిల్లా డీసీపీ రవికుమార్ సింగ్ అత్యవసర ల్యాండింగ్‌ను ధ్రువీకరించారు. పారిస్‌కు బయలుదేరిన విమానం కొద్దిసేపట్లోనే అత్యవసరంగా చేశారు. విమానంలో సాంకేతిక సమస్యలను గుర్తించిన అనంతరం విమానాన్ని మళ్లీ ఢిల్లీకి మళ్లించినట్లు ఎయిర్ ఇండియా తెలిపింది. విమానం సురక్షితంగా ల్యాండ్ అయ్యిందని పేర్కొంది.