Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చిత్తూరు: జిల్లాలోని కుప్పంలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సభకు వెళ్లేందుకు ప్రయత్నించిన టీడీపీ కార్యకర్తలు, మహిళలపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ఈ లాఠీచార్జ్‌లో పలువురు తెలుగుదేశం కార్యకర్తలు గాయపడ్డారు. పలువురు మహిళలు స్పృహతప్పి పడిపోయారు. కాసేపట్లో చంద్రబాబు నాయుడు శాంతిపురం మండలానికి రానున్నారు. చంద్రబాబు రోడ్ షో, సభకు అనుమతి లేదంటూ.. ఎవరూ రాకూడదని పోలీసులు ఆంక్షలు విధించారు. సభకు హాజరుకాకూడదంటూ కార్యకర్తలను అడ్డుకున్నారు. బారికేడ్లతో నిర్బంధించారు. పోలీసుల ఓవరాక్షన్‌పై తెలుగుదేశం కార్యకర్తలు మండిపడుతున్నారు. అడ్డుపెట్టిన బారికేడ్లను తొలగించే యత్నం చేశారు. ఈ క్రమంలో పోలీసులు, టీడీపీ శ్రేణుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. చంద్రబాబు సభకు రాకుండా ఎందుకు అడ్డుకుంటున్నారని పోలీసులను టీడీపీ శ్రేణులు నిలదీస్తున్నారు.