Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ అస్వస్థతకు గురయ్యారు. ఆమెను ఢిల్లీలోకి సర్ గంగారామ్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. సోనియా కూతురు ప్రియాంకా గాంధీ ఆమెతో పాటు ఆస్పత్రికి వెళ్లారు. అయితే సాధారణ వైద్య పరీక్షల నిమిత్తమే ఆమె ఆస్పత్రికి వెళ్లారని కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక సీనియర్ నేత చెప్పారు. మరోవైపు 76 ఏళ్ల సోనియాగాంధీ శ్వాస తీసుకోవడంలో ఇబ్బందితో బాధపడుతున్నారని పీటీఐ మీడియా సంస్థ వెల్లడించింది. నిన్నటి నుంచి ఆమె ఆరోగ్యం బాగోలేదని తెలిపింది. ఇంకోవైపు నిన్న సాయంత్రం రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ఉత్తరప్రదేశ్ లోకి ప్రవేశించింది. తమ తల్లికి ఆరోగ్యం బాగోలేదనే విషయం తెలిసిన వెంటనే రాహుల్, ప్రియాంక ఢిల్లీకి వచ్చారు. సోనియా అనారోగ్యంపై కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పందిస్తూ... ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. సోనియా అనారోగ్యంపాలయ్యారనే వార్తను వినడం బాధాకరమని చెప్పారు.