నిజామాబాద్ నగరంలోని ఐదవ పోలీస్ స్టేషన్ పరిధిలో హత్యాయత్నం (అటెం టు మర్డర్) కేసు నమోదు చేసినట్లు ఐదవ పోలీస్ స్టేషన్ ఎస్ఐ సాయినాథ్ బుధవారం తెలిపారు. ఎస్ఐ సాయినాథ్ తెలిపిన వివరాల ప్రకారం..నిజామాబాద్ ఐదవ టౌన్ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో,రెండు రోజుల క్రితం నాగారం ఏరియాలో 300 క్వాటర్స్ కు చెందినటువంటి రామగిరి ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తి కి ఆటోలో ఎక్కే విషయమై డ్రైవర్స్ కాలనీకి చెందినటువంటి నోమన్ అనే వ్యక్తి గొడవ చేసి, ప్రవీణ్ నీ కొట్టి అదే విధంగా కత్తితో గాయపరిచాడని, ప్రవీణ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని ఈరోజు నోమన్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకొని, అతని వద్ద నుండి కత్తిని సీజ్ చేసి అతనిపై 307 ఐపిసి (అటెంప్ట్ టూ మర్డర్) కేసు కేసు పై రిమాండ్ చేయడం జరిగిందన్నారు.అదేవిధంగా ఉన్నతాధికారుల సూచన మేరకు అతనిపై రౌడీషీట్ కూడా నమోదు చేయడం జరుగుతుంది. ఎవరైనా చట్ట వ్యతిరేక, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినట్లయితే వారి పైన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించడమైనది. రౌడీషీటర్ లందరినీ కూడా మంగళవారం సాయంత్రం నార్త్ రూరల్ సర్కిల్ ఆఫీస్ కి పిలిపించి నార్త్ సర్కిల్ ఇన్స్పెక్టర్ నరహరి వారిని గట్టిగా హెచ్చరించడం జరిగింది. రౌడీ షీటర్ లపైన నిరంతరం వారిపై నిఘా వుంచనున్నట్లు తెలిపారు. ఇలాంటి చిన్న తప్పులకు పాల్పడ్డ చట్ట ప్రకారంగా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఉత్తర మండల రూరల్ సర్కిల్ సిఐ రౌడీషీటర్లకు హెచ్చరించారు.