Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: న్యూయార్క్-ఢిల్లీ విమానంలో ప్రయాణిస్తూ మద్యం మత్తులో ఓ మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన ప్రయాణికుడిపై ఎయిర్ ఇండియా చర్యలు తీసుకుంది. తమ విమానాల్లో ప్రయాణించకుండా 30 రోజుల పాటు అతనిపై నిషేధం విధించింది. అతడిని నో-ఫ్లై జాజితాలో చేర్చాలని డీజీసీఏకు సిఫారసు చేసినట్టు ఎయిర్ ఇండియా తెలిపింది. ప్రస్తుతం దీనిపీ డీజీసీపీ కమిటీ దర్యాప్తు చేస్తోంది. నవంబర్ 26వ తేదీన న్యూయార్క్ నుంచి ఢిల్లీ వస్తున్న ఏఐ-102 విమానంలో మద్యం మత్తులో ఉన్న ప్రయాణికుడు బిజినెస్ క్లాస్లో కూర్చున్న ఒక మహిళ దగ్గరకు వచ్చి ఆమెపై మూత్రవిసర్జన చేసిన విషయాన్ని ఎయిర్ ఇండియా ధ్రువీకరించింది.