Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
కుప్పం నియోజకర్గంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. తన సొంత నియోజకవర్గ పర్యటనకు వెళ్లిని టీడీపీ అధినేత చంద్రబాబును పోలీసులు అడ్డుకున్నారు. ర్యాలీకి, సభకు అనుమతి లేదని పోలీసులు చెపుతున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులపై చంద్రబాబు నిప్పులు చెరిగారు. తన నియోజకవర్గంలో తాను పర్యటించేందుకు ఎవరి అనుమతి కావాలని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మరోవైపు చంద్రబాబు అక్కడకు చేరుకోవడానికి ముందే పెద్ద సంఖ్యలో టీడీపీ శ్రేణులు అక్కడకు చేరుకున్నాయి. ఈ క్రమంలో వారిపై పోలీసులు లాఠీఛార్జీ కూడా చేశారు. ఈ క్రమంలో పలువురు గాయపడ్డారు. కొందరు మహిళలు స్పృహతప్పి పడిపోయారు. పోలీసులతో టీడీపీ కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు.