Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: కొత్త సంవత్సరంలో దేశీయ స్టాక్ మార్కెట్ల రెండు రోజుల వరుస లాభాలకు ఈరోజు బ్రేక్ పడింది. ఈరోజు ట్రేడింగ్ ప్రారంభమైన వెంటనే మార్కెట్లు నష్టాల్లోకి జారాయి. అంతర్జాతీయంగా ఎలాంటి అనుకూల సంకేతాలు లేకపోవడం ఇన్వెస్టర్ల సెంటిమెంటును దెబ్బతీసింది. మరోవైపు అమెరికా ఫెడరల్ రిజర్వ్ డిసెంబర్ సమావేశ వివరాలు ఈ రాత్రి వెలువడనున్నాయి. ఈ క్రమంలో, మదుపరులు అప్రమత్తంగా వ్యవహరించారు. ఆ తర్వాత ఏ దశలో కూడా కొనుగోళ్ల మద్దతు లభించలేదు. దీంతో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 636 పాయింట్లు నష్టపోయి 60,657కి పడిపోయింది. నిఫ్టీ 189 పాయింట్లు కోల్పోయి 18,042కి దిగజారింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్: మారుతి (0.43%), అల్ట్రాటెక్ సిమెంట్ (0.10%), టీసీఎస్ (0.10%).
టాప్ లూజర్స్: టాటా స్టీల్ (-2.32%), పవర్ గ్రిడ్ (-2.09%), టాటా మోటార్స్ (-2.09%), విప్రో (-1.83%), ఇన్ఫోసిస్ (-1.82%).