Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
ప్రతికూల వాతావరణం.. కేంద్ర హోం మంత్రి విమానం గువాహటిలో అత్యవసర ల్యాండింగ్
న్యూఢిల్లీ: కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రయాణిస్తున్న విమానం గువాహటిలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. బుధవారం రాత్రి న్యూఢిల్లీ నుంచి త్రిపురలోని అగర్తలకు ప్రత్యేక విమానంలో అమిత్ షా బయల్దేరారు. అయితే అగర్తలలో పొగమంచు దట్టంగా కమ్ముకోవడంతో విమానం ల్యాండ్ అవడానికి అక్కడి ఎయిర్పోర్టు అధికారులు అనుమతించలేదు. దీంతో దానిని అసోంలోని గువాహటికి మళ్లించారు. ఈనేపథ్యంలో ఆయన విమానం గువాహటీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. తిరిగి గురువారం ఉదయం ఆయన త్రిపుర బయల్దేరనున్నారు. త్రిపుర అసెంబ్లీ ఎన్నికలు త్వరలో జరుగనున్నాయి. ఈనేపథ్యంలో అగర్తలలో పార్టీ ప్రచారాన్ని ప్రారంభించడానికి అమిత్ షా వెళ్తున్నారు. అయితే ప్రతికూల వాతావరణం నేపథ్యంలో ఆయన గువాహటిలో దిగాల్సి వచ్చింది.