Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
సిద్దిపేట పట్టణంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత పట్టణంలోని ఓ దుకాణంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్రమంగా అవి ఎక్కువ కావడంతో పక్క షాపులకు విస్తరించాయి. దీంతో ఐదు దుకాణాలు అగ్నికి ఆహుతయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేశారు. దుకాణాల్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం జరుగలేదని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, షార్ట్ సర్య్కూట్ వల్లే అగ్నిప్రమాదం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు.