Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - చెన్నై
చెన్నై-ఢిల్లీ మధ్య అదనంగా రెండు సర్వీసులను ఎయిర్ ఇండియా ప్రారంభించింది. నగరం నుంచి ఢిల్లీకి ప్రతిరోజూ వివిధ సంస్థలకు చెందిన 19 విమానాలు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రయాణీకుల రద్దీకనుగుణంగా ఎయిర్ ఇండియా మరో రెండు సర్వీసులను అదనంగా నడపాలని నిర్ణయించింది. చెన్నై నుంచి ఉదయం 7.50, సాయంత్రం 3.40 గంటలకు ఈ విమా నాలు బయలుదేరనున్నాయి. అదే విధంగా ఢిల్లీ నుంచి మధ్యాహ్నం 2.45 గంటలకు, రాత్రి 10.35 గంటలకు విమానాలు బయలుదేరుతాయని అధికారులు తెలిపారు.