Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
ఇంగ్లాండ్ యువ ఆల్‌రౌండర్ సామ్ కరన్‌కు చేదు అనుభవం ఎదురైంది. వర్జిన్ అట్లాంటిక్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానంలో ప్రయాణించేందుకు సామ్ కరన్‌ను సిబ్బంది అడ్డుకున్నారు. అతనికి కేటాయించిన సీటు విరిగిపోయిందన్న కారణంతో సామ్ కరన్‌ను విమానం ఎక్కేందుకు అనుమతించలేదు. ఈ విషయాన్ని సామ్ కరన్ ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు. ‘వర్జిన్ అట్లాంటిక్ ఎయిర్‌లైన్స్ విమానంలో ప్రయాణించేందుకు సిద్ధమవుతుండగా.. నాకు కేటాయించిన సీటు విరిగిపోయిందని సిబ్బంది చెప్పారు. అందులో మీరు ప్రయాణించడం కుదరదు అని తెలిపారు. ధన్యవాదాలు వర్జిన్ అట్లాంటిక్. ఇలాంటి సంఘటనతో నేను తీవ్ర అసౌకర్యాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది’ అంటూ ట్వీట్ చేశాడు. దీనిపై ఎయిర్‌లైన్స్ స్పందించింది. ఈ ఘటనతో అసౌకర్యం కలిగినందుకు క్షమాపణలు చెప్పింది. ఈ విషయాన్ని తమ హెల్ప్ డెస్క్ దృష్టికి తీసుకొచ్చి ఉంటే.. వారు మరో విమానంలో సీటు కేటాయించేవారు అంటూ ట్వీట్ చేసింది. ప్రస్తుతం సామ్ కరన్ ట్వీట్ వైరల్ అవుతోంది.
గత ఏడాది డిసెంబర్లో జరిగిన ఐపీఎల్ 2023 వేలంలో సామ్ కరన్ రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. ఐపీఎల్ వేలంలో అత్యధిక ధర పలికిన ఆటగాడిగా గుర్తింపు సాధించాడు. టీ 20 వరల్డ్ కప్‌లో అదరగొట్టిన సామ్ కరన్‌ను పంజాబ్ కింగ్స్ రూ.18.50 కోట్లకు దక్కించుకుంది. వేలంలో అతను భారీ ధరకు అమ్ముడుపోవడం ఖాయమని మాజీలు అభిప్రాయపడ్డారు. ఊహించినట్టుగానే సామ్ కరన్‌ను కొనేందుకు ఫ్రాంఛైజీలు పోటీపడ్డాయి. చివరకు పంజాబ్ కింగ్స్ ఈ ఆల్‌రౌండర్ కోసం రూ. 18 కోట్ల భారీ ధర పెట్టింది.