Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఆస్ట్రేలియా
ఆస్ట్రేలియా క్రికెటర్ స్టీవ్ స్మిత్ టెస్టుల్లో 30వ సెంచరీ చేశాడు. సిడ్నీలో సౌతాఫ్రికాతో జరుగుతున్న మూడవ టెస్టులో అతను 104 రన్స్ చేసి ఔటయ్యాడు. ఇక క్రికెట్ దిగ్గజం డాన్ బ్రాడ్‌మాన్ రికార్డును కూడా స్టీవ్ స్మిత్ దాటేశాడు. టెస్టుల్లో ఆసీస్ బ్యాటర్ బ్రాడ్‌మాన్ ఖాతాలో 29 టెస్టు సెంచరీలు ఉన్నాయి. ఆ రికార్డును ఆసీస్ బ్యాటర్ స్మిత్ బ్రేక్ చేశాడు. బ్రాడ్‌మాన్ రికార్డును దాటేసిన మూడవ ఆసీస్ బ్యాటర్‌గా స్మిత్ నిలిచాడు. ఈ మ్యాచ్‌లో స్మిత్ 192 బంతుల్లో 11 ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 104 రన్స్ చేసి నిష్క్రమించాడు. ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ మాథ్యూ హేడన్ ఖాతాలోనూ 30 సెంచరీలు ఉన్నాయి. ఆస్ట్రేలియాకు అత్యధిక సెంచరీలు స్కోర్ చేసిన బ్యాటర్లలో రికీ పాంటింగ్(41), స్టీవ్ వా(32)లు ఉన్నారు.