Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఆస్ట్రేలియా
ఆస్ట్రేలియా మేటి మహిళా క్రికెటర్, మాజీ కెప్టెన్ బెలిండా క్లార్క్‌కు అరుదైన గౌరవం దక్కింది. సిడ్నీ మైదానంలో ఆమె కాంస్య విగ్రహాన్ని ఇవాళ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో తోటి క్రికెటర్లతో పాటు పలు దేశాలకు చెందిన మహిళా క్రికెటర్లు హాజరయ్యారు. ఆ వేదకగా ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా మధ్య రెండవ టెస్టు జరుగుతున్న విషయం తెలిసిందే. ఆస్ట్రేలియా జాతీయ జట్టుకు 1991 నుంచి 2005 వరకు మెలిండా ప్రాతినిధ్యం వహించారు. తన స్టాచ్యూను స్టేడియంలో చూడడం సంతోషాన్ని ఇస్తోందని క్లార్క్ తెలిపారు.
బెలిండా క్లార్క్ మేటి రైట్ హ్యాండ్ బ్యాటర్. ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్లలో అత్యధికంగా వన్డేల్లో పరుగులు చేసిన క్రికెటర్‌గా ఆమె పేరిట రికార్డు ఉంది. 1997, 2005 సంవత్సరాల్లో ఆమె సారథ్యంలోనే ఆస్ట్రేలియా వరల్డ్‌కప్‌ను గెలుచుకున్నది. వన్డే మ్యాచ్‌లో డబుల్ సెంచరీ చేసిన తొలి మహిళా క్రికెటర్‌గా బెలిండా నిలిచారు. 1997లో డెన్మార్క్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆమె 155 బంతుల్లో 229 రన్స్ చేసింది. 2005లో ఆమె క్రికెట్ నుంచి రిటైరయ్యారు. 2011లో ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌లో ఆమె పేరును జోడించారు. బెలిండా క్లార్క్ మొత్తం 118 వన్డేలు ఆడింది. దాంట్లో 4844 రన్స్ చేసిందామె. 30 హాఫ్ సెంచరీలు, అయిదు సెంచరీలు ఉన్నాయి. టెస్టు మ్యాచ్‌లు కేవలం 15 మాత్రమే ఆడింది. టెస్టుల్లో 45 సగటుతో ఆమె 919 రన్స్ చేసింది.