Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
ఆడుకుంటూ ఆడుకుంటూ ఓ పిల్లాడు వెడల్పాటి ఇత్తడి గిన్నెలో ఇరుక్కుపోయాడు. తల కింది భాగమంతా అందులోనే ఉండిపోయింది. బయటకు తీయడానికి ఎంత ప్రయత్నించినా ఉపయోగం లేకపోవడంతో వెల్డింగ్ షాపుకు తీసుకెళ్లారు. చివరకు గిన్నెను కట్ చేసి బాలుడిని బయటకు తీశారు. వరంగల్ జిల్లాలోని పర్వతగిరి మండలం మూడెత్తుల తండాలో చోటుచేసుకుందీ ఘటన. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
తల్లిదండ్రులు తమ పనిలో ఉండగా ఆ పక్కనే ఆడుకుంటున్న రెండేళ్ల బాలుడు ఇత్తడి పాత్రలోకి దిగాడు. తల భాగం మాత్రమే పైకి ఉంది. మిగతా శరీరం మొత్తం అందులోనే ఉంది. బయటకు రావడం వీలుకాకపోవడంతో బాలుడు ఏడుపు అందుకున్నాడు. బాలుడిని ఆ పాత్రతో పాటూ వెల్డింగ్ షాపుకు తీసుకెళ్లగా.. అక్కడ గంట సేపు కష్టపడి పాత్రను కట్ చేసి బాలుడిని బయటకు తీశారు. దీంతో ఆ బాలుడి తల్లిదండ్రులు ఉపిరి పీల్చుకున్నారు. తర్వాత బాలుడిని ఆసుపత్రికి తీసుకెళ్లగా.. పరీక్షించిన వైద్యులు బాలుడికి ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పారు.