Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం చెలరేగింది. ఉటా ప్రావిన్స్‌లో బుధవారం రాత్రి జరిగిన కాల్పుల్లో 8 మంది దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో ఐదుగురు చిన్నారులు ఉన్నారు. చనిపోయిన వారంతా ఒకే కుటుంబానికి చెందినవారుగా తెలుస్తున్నది. ఈ ఘటన ఎనోచ్ సిటీలోని ఓ ఇంట్లో జరిగినట్లు స్థానిక పోలీసుల సమాచారం. అందరి శరీరాలపై బుల్లెట్లు దిగిన గుర్తులు ఉన్నాయని, ఎవరు ఏ ఉద్దేశంతో ఈ దాడికి పాల్పడి ఉంటారో తెలియరాలేదు. దక్షిణ ఉటా ప్రావిన్స్‌లోని ఇనాక్ సిటీలోని ఓ ఇంట్లో 8 మంది చనిపోయి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. సాల్ట్‌లేక్ సిటీకి 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ పట్టణంలో కాల్పులు జరగడం వల్ల వీరంతా చనిపోయి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహాలపై బుల్లెట్లు దిగిన ఆనవాళ్ల ఉన్నాయి. పోలీసుల తనిఖీల సందర్భంగా మృతదేహాలు బయటపడ్డాయని ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. మృతుల్లో ఐదుగురు చిన్నపిల్లలు ఉన్నారని, ఎవరు కాల్చి చంపారనేది తెలుసుకునేందుకు ఉటా పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు.