Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : జూబ్లీహిల్స్‌లోని పవన్ కల్యాణ్ నివాసం వద్ద గురువారం ఓ మహిళ హల్చల్ చేసింది. తమిళనాడులోని మధురై ప్రాంతానికి చెందిన జోసి కమల (36) అనే మహిళ కొద్దికాలంగా జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేల కాలనీలో నివాసం ఉంటున్న సినీనటుడు సాయిధరమ్ తేజ్ ఇంటి వద్దకు తరచూ వస్తోంది. సాయిధరమ్ తేజ్‌ను కలవాలని, ఆయనతో మాట్లాడాలని ఇంటి ఎదుట బైఠాయిస్తోంది. గతంలోనే పలుమార్లు జూబ్లీహిల్స్ పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకొన్నారు. తర్వాత వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించి సంబంధీకులకు అప్పజెప్పారు. తాజాగా సాయిధరమ్ తేజ్.. పవన్ ఇంటికి వెళ్లిన విషయం తెలుసుకొని నేరుగా అక్కడికి వెళ్లి ఇంటి ముందు బైఠాయించింది. దీంతో పవన్ కల్యాణ్ సెక్యూరిటీ సిబ్బంది అందించిన సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకొని మహిళను అదుపులోకి తీసుకున్నారు. ఆమె మానసిక స్థితి సరిగాలేదని కోర్టులో హాజరుపరిచి మానసిక చికిత్సాలయానికి తరలించేందుకు కోర్టు అనుమతి కోరుతామని జూబ్లీహిల్స్ పోలీసులు తెలిపారు.