Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : దేశంలోనే సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ నంబర్ వన్ స్థానంలో నిలుస్తుందని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్ అన్నారు. గురువారం జగిత్యాల పట్టణంలో జిల్లా దివ్యాంగుల ముఖ్య నాయకుల సమావేశంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివ్యాంగులకు రూ. 3వేలు అందిస్తున్నది తెలంగాణ ప్రభుత్వమేనని అన్నారు. దివ్యాంగులను సకలాంగులు పెండ్లి చేసుకుంటే కల్యాణ లక్ష్మితో పాటు అధనంగా రూ. లక్ష అందజేస్తున్నామని పేర్కొన్నారు. మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్సీ కవిత సహకారంతో దివ్యాంగులకు త్రీ వీలర్ స్కూటీలు, మోటారైజ్డ్ ట్రైసైకిళ్లు, ఇతర పరికరాలు అందజేస్తున్నామని వెల్లడించారు. పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత మాట్లాడుతూ దివ్యాంగులకు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉందని అన్నారు. ప్రభుత్వం అందజేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేస్తున్న నాయకులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజల పైనే ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా కన్వీనర్ బందు సత్యం,నాయకులు లంక దాసరి శ్రీనివాస్, అశ్ఘర్ ఖాన్, ప్రవీణ్,సర్పంచ్ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.