Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హిమాయత్ సాగర్ చెరువులో దూకడానికి యత్నించిన ఓ వివాహిత, ఆమె ఇద్దరు పిల్లలను రాజేంద్ర నగర్ ట్రాఫిక్ సీఐ శ్యాంసుందర్ రెడ్డి కాపాడారు. భర్తతో గొడవ పడి తన ఇద్దరు పిల్లలతో హిమాయత్ సాగర్ చెరువు వద్దకు ఓ మహిళ చేరుకుంది. పిల్లలతో కలిసి చెరువులో దూకడానికి ప్రయత్నించిన మహిళను చూసి చెరువు వద్దకు ట్రాఫిక్ పోలీసులు పరుగులు తీశారు. మహిళను, ఇద్దరు పిల్లలను ట్రాఫిక్ సిబ్బంది వెనక్కి లాగేశారు. అనంతరం వారిని రాజేంద్రనగర్ పోలీసులకు అప్పగించారు. వివాహిత బండ్లగూడ జాగీర్ కార్పొరేషన్ హైదర్ షాకోట్ ప్రాంతానికి చెందిన కుర్మమ్మగా గుర్తించారు. చిన్నారులు జశ్విత, జస్వంత్ అని పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా రాజేంద్రనగర్ పోలీసులు ఆమెకు కౌన్సెలింగ్ చేసి, ఇంటికి పంపించారు.