Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : విపక్ష పార్టీలు రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేయడం తప్ప తెలంగాణ కోసం చేసిందేమీ లేదని మంత్రి హరీశ్ రావు అన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రాష్ట్రానికి ఒక్క మెడికల్ కాలేజీ అయినా తెచ్చారా అని ప్రశ్నించారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఒక్క డయాలిసిస్ సెంటర్ అయినా తీసుకురాగలిగారా అని అడిగారు. ఆరోగ్యం విషయంలో కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సొంత రాష్ట్రం యూపీ చివరి స్థానంలో ఉందని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తే బండి సంజయ్ కుళ్లుకుంటున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ ఉద్యోగాలు కల్పించే పార్టీ అయితే... బీజేపీ ఉద్యోగాలను ఊడగొట్టే పార్టీ అని ఎద్దేవా చేశారు.