Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గోవిందరావుపేట
మండల కేంద్రంలోని శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో గురువారం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. మండల కేంద్రానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త గూడవల్లి జయప్రకాష్ నలిని దంపతులు ఈ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆలయ ప్రధాన అర్చకులు శివశర్మ అభిషేకము మరియు మధ్యాహ్న హారతి పూజా కార్యక్రమాలు నిర్వహించి ముందుగా అయ్యప్ప స్వాములకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
అనంతరం ప్రకాష్ నలిని దంపతులు స్వాముల దీవెనలు ఆశీర్వాదాలు అందుకున్నారు. ఈ అన్నదాన కార్యక్రమంలో మండలంలోని ప్రముఖులు రాజకీయ నాయకులు ఉన్నతాధికారులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.