Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడపాలని నిర్ణయించింది. పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకుని 6,400 ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు ఏపీఎస్ఆర్టీసీ ప్రకటించింది. ఈ ప్రత్యేక బస్సులు జనవరి 6 నుంచి 14 వరకు, జనవరి 16 నుంచి 19వ తేదీ వరకు అందుబాటులో ఉంటాయన్నారు. అన్ని బస్సుల్లో అడ్వాన్స్ రిజర్వేషన్లు ప్రారంభమయ్యాయి. తదితర వివరాల కోసం ఏపీఎస్ ఆర్టీసీ వెబ్సైట్ను సంప్రదించొచ్చు.