Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : తెలంగాణ ఆర్ అండ్ బీ శాఖలో కొత్తగా 472 పోస్టులను సృష్టిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. 132 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీరింగ్(సివిల్) పోస్టులు, 90 డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్(సివిల్) పోస్టులు, 61 జూనియర్ అసిస్టెంట్స్ పోస్టులతో పాటు మరి కొన్ని పోస్టులను కొత్తగా సృష్టించారు. గతేడాది డిసెంబర్ 10వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో సమావేశమైన రాష్ట్ర మంత్రి వర్గం కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. రోడ్లు భవనాల శాఖలో పెరిగిన పనికి అనుగుణంగా శాఖను పునర్ వ్యవస్థీకరించేందుకు కేబినెట్ నిర్ణయించింది. ఇందులో భాగంగా ఆర్ అండ్ బీ శాఖలోని పలు విభాగాల్లో మొత్తం 472 అదనపు పోస్టులను కేబినెట్ మంజూరు చేసింది.