Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే పలు అంతర్జాతీయ కంపెనీలు తమ కార్యకలాపాలను రాష్ట్రంలో ప్రారంభించగా, తాజాగా గోద్రెజ్ సంస్థ తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల్లో వంట నూనెల ప్రాసెసింగ్ ప్లాంట్ ఏర్పాటు కోసం రూ. 250 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు గోద్రెజ్ సంస్థ ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌తో గోద్రెజ్ ఆగ్రోవెట్ లిమిటెడ్ ఎండీ బలరాం సింగ్ యాదవ్ సమావేశమై పెట్టుబడులు పెడుతున్నట్లు తెలిపారు. ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల్లో ప్రత్యక్షంగా 250 మందికి, పరోక్షంగా 500 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.