Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో అందజేయనున్న సబ్సిడీ రుణాలకు విధించిన దరఖాస్తుల స్వీకరణ గడువును జనవరి 9వ తేదీ వరకు పొడగించారు. ఈ మేరకు మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ మహ్మద్ ఇంతియాజ్ ఇషాక్ గురువారం వెల్లడించారు. 2022-23 సంవత్సరానికి గాను మైనార్టీ కార్పొరేషన్ ద్వారా ఎకనామిక్ సపోర్ట్ పథకం కింద అర్హులైన మైనార్టీలకు సబ్సిడీ రుణాలుగా అందజేయాలని నిర్ణయించామని వివరించారు. రూ.లక్ష యూనిట్‌కు 80శాతం, రూ.2లక్షల యూనిట్‌కు 70 శాతం సబ్సిడీతో రుణాలను మంజూరు చేయనుండగా, మిగిలిన మొత్తాన్ని బ్యాంకు రుణంగా అందజేయనున్నామని తెలిపారు. దరఖాస్తుల స్వీకరణకు తొలుత 5వ తేదీ వరకు విధించిన గడువు ముగియగా, మరింత మందికి అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో 9వ తేదీ వరకు పొడిగించినట్లు వెల్లడించారు. మైనార్టీ వర్గానికి చెంది ఉండి.. 22 నుంచి 55 ఏళ్ల వయస్సు ఉన్న, గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.50 లక్షల ఆదాయం, పట్టణ ప్రాంతాల వారయితే రూ.2 లక్షల వార్షిక ఆదాయం మించని వారు సబ్సిడీ రుణాలకు అర్హులని తెలిపారు. అర్హులైన వారు ఆధార్‌కార్డు, రేషన్‌కార్డుతో ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని, అవకాశాన్ని మైనార్టీ యువత సద్వినియోగం చేసుకుని, ఆర్థికంగా స్వశక్తితో ఎదగాలని చైర్మన్ ఈ సందర్భంగా సూచించారు.