Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : సిరీస్ డిసైడర్ అయిన రెండో టీ20లో శ్రీలంక 206 పరుగుల భారీ స్కోర్ చేసింది. చివర్లో కెప్టెన్ దసున్ శనక అర్థ సెంచరీ(56)తో కదం తొక్కాడు. 20 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసి రికార్డు క్రియేట్ చేశాడు. టీ20ల్లో వేగవంతమైన సెంచరీ చేసిన శ్రీలంక మూడో ఆటగాడిగా గుర్తింపు సాధించాడు. అతని ఇన్నింగ్స్‌లో 6 సిక్స్‌లు, 2 ఫోర్లు ఉన్నాయి. అంతకుముందు ఓపెనర్లు శాల్ మెండిస్ (54), ప్రథుమ్ నిస్సంకా (33) శుభారంభం ఇచ్చారు. హాఫ్ సెంచరీ తర్వాత మెండిస్, చాహల్ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. ఆ తర్వాత వచ్చిన రాజపక్సే మరోసారి నిరాశపరిచాడు. ఉమ్రాన్ మాలిక్ అతడిని బౌల్డ్ చేశాడు. 37 పరుగులు చేసిన అలసంక భారీ షాట్‌కు ప్రయత్నించి ఉమ్రాన్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. ఓపెనర్ నిస్సంక (33) అక్షర్ పటేల్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. రాహుల్ త్రిపాఠి క్యాచ్ పట్టడంతో అతను నిరాశగా వెనుదిరిగాడు. భారత బౌలర్లలో ఉమ్రాన్ మాలిక్ మూడు, చాహల్ రెండు వికెట్లు పడగొట్టారు. యజువేంద్ర చాహల్‌కు ఒక వికెట్ దక్కింది.